కమ్యూనిస్టు యోధుడు కన్నుమూత

కమ్యూనిస్టు యోధుడు కన్నుమూత

కోల్కతా: రెండు సార్లు లోక్సభకు, మూడుసార్లు రాజ్యసభకు ఎంపికై రెండున్నర దశాబ్దాల సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్గా సేవలందించిన కమ్యూ నిస్టు కురువృద్ధుడు, సీపీఐ సీనియర్ నాయకుడు గురుదాస్ దాస్గుప్తా (83) గురువారం ఇక్కడ అస్తమించారు. గత కొన్నాళ్లుగా ఊపిరితిత్తుల క్యాన్సర్, మూత్రపిండాల వ్యాధులతో సతమతమవుతున్న గురుదాస్ ఇక్కడి భవానీపూర్ లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య జయశ్రీ దాస్ గుప్తా, ఒక కుమార్తె ఉన్నారు. గురుదాస్ ప్రస్తుతం బంగ్లాదేశ్ లో భాగంగా ఉన్న బారిసలా ప్రాంతంలో 1936 నవంబరు 3న జన్మిం చారు. పోరాట యోధుడిగా, వాక్చాతుర్యం ఉన్న నేతగా పేరున్న ఆయన రచయిత కూడా. ‘సెక్యూరిటీస్ స్కాండల్- ఏ రిపోర్ట్ టు ది నేషన్’ అనే పుస్త కాన్ని రాశారు. 1985, 1988, 1994లో రాజ్యసభకు ఎంపికైన ఆయన 2004లో పంక్సురా లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. 20 09లో ఘాటల్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 15వ సభలో సీపీఐ లోక్సభా పక్షం నేతగా కూడా పని చేశారు. 2001లో ఆలిండియా ట్రేడ్ యూని యన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 2జీ స్ప్రెక్ట్రం కుంభకోణంపై ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ సమితి సభ్యు డుగా కూడా పని చేసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos