న్యూ ఢిల్లీ: రాజ్యసభలో 8 మంది సభ్యుల సస్పెన్షన్ను నిరసిస్తూ పార్లమెంట్ అవరణలోని గాంధీ విగ్రహం ఎదుట విపక్షాలు సోమవారం ఆందోళనకు దిగాయి. టీఆర్ఎస్ ఎంపీలు కేకే, లింగయ్య యాదవ్, సంతోష్ కుమార్, సురేష్ రెడ్డి తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కేంద్రం ఖూనీ చేస్తోందని నినదించారు. రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసారు.