లక్నో: బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీ రామ్ది మృతిపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని మంత్రి గిరిరాజ్ సింగ్ ధర్మేష్ గురువారం ఇక్కడ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్కు విన్నవించారు. ‘కాన్షీ రామ్ది సహజ మరణం కాదు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మాయావతి పర్యవేక్షణలోనే ఆయనకు చికిత్స జరిగింది. కాన్షీ రామ్ను మాయావతే చంపిందని ఆయన సోదరి చెప్పింద’ని పేర్కొన్నారు. ‘మాయావతి గాల్లో వేలాడే కరెంటు తీగ లాంటి వ్యక్తి. ఎవరూ ముట్టుకున్నా చనిపోవడం ఖాయమ’ని వ్యాఖ్యానించారు. భాజపా ఆమెను మూడుసార్లు ముఖ్యమంత్రి చేసింది. ఆమె మాత్రం భాజపాకు ద్రోహం చేసింద’ని ఆరోపించారు.