తరన్ తరన్: 12 ఏళ్ల క్రితం దళిత యువతిని వేధించిన కేసులో.. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ లాల్పురాతో పాటు మరో ఏడు మందిని దోషులుగా తేల్చి, వాళ్లను అరెస్టు చేశారు. తర్న్ తరన్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. పట్టి సబ్ జైలుకు ఎమ్మెల్యేతో పాటు ఇతరులను తీసుకెళ్లారు. అదనపు సెషన్స్ జడ్జీ ప్రేమ్ కుమార్ ఈ కేసులో తీర్పును ఇచ్చారు. ఖాదూర్ సాహిబ్ నియోజకవర్గ ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ గతంలో ఆటో డ్రైవర్గా చేశారు. 2013, మార్చి 3వ తేదీన 19 ఏళ్ల ఎస్సీ మహిళపై దాడి జరిగింది. వేధింపులకు పాల్పడిన వారిలో ఎమ్మెల్యే మంజిందర్ సింగ్ కూడా ఉన్నాడు. అయితే ఈ కేసులో సెప్టెంబర్ 12వ తేదీన శిక్షను వెల్లడించనున్నారు.