విజయవాడ: దళితులు క్రిస్టియన్ మతంలోకి మారిన మరుక్షణం ఎస్సీ హోదా కోల్పోతుందని రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు దురదృష్టకరమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన పత్రికా ప్రకటనను విడుదల చేశారు. ఏ మతంలోకి మారినా దళితులు అంటరానితనానికి, వివక్షతకు గురవుతూనే ఉన్నారు. క్రిస్టియానిటీ కులాన్ని గుర్తించకపోయినా కుల వివక్ష కొనసాగుతున్నదని అనేక నివేదికలు వెల్లడించాయన్నారు. మన దేశంలో కులం మతంపై ఆధారపడిలేదు. వ్యవస్థీకృతమై ఉంది. కులం పునాదుల్ని తొలగించడానికి అవసరమైన రాజకీయ, ఆర్ధిక, సామాజిక చర్యల్ని తీసుకోవాలని కోరారు. కాబట్టి దళిత క్రిస్టియన్లను ఎస్సీలుగా గుర్తించాలన్నారు. అందుకు అవసరమైన చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.