అంత్యక్రియలకు వేరే దారి లేక…

అంత్యక్రియలకు వేరే దారి లేక…

వేలూరు : సమాజంలో ఎన్నో మార్పులు వచ్చినా, ఈ అనాగరిక ఆచారం ఇంకా కొనసాగుతూనే ఉంది. మృతుడు దళితుడన్న కారణానికి అతని అంతిమ యాత్ర సైతం తమ పొలాల మీదుగా వెళ్లకూడదని అగ్రవర్ణ దురహంకారం హుంకరించింది. మృతుని బంధువులు వేరే దారి లేక ఈ మార్గాన్ని ఎంచుకోవాల్సి వ్చచింది. తమిళనాడులోని వేలూరు జిల్లా వాణియంబాడిలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎన్‌. కుప్పం (46) అనే వ్యక్తి శనివారం మరణించాడు. అంత్యక్రియల కోసం మృతదేహాన్ని తమ పొలాల మీదుగా తీసుకెళ్లడానికి అగ్రవర్ణాలు అంగీకరించలేదు. ఆది ద్రావిడులకు చెందిన శ్మశాన వాటికకు ఈ పొలాల మీదుగానే వెళ్లాల్సి ఉంది. యజమానులు అంగీకరించకపోవడంతో సమీపంలోని వంతెన కింద నుంచి మృతదేహాన్ని తరలించాలనుకున్నారు. దీనికోసం కుటుంబ సభ్యులు మృత దేహాన్ని ఇరవై అడుగుల ఎత్తు నుంచి తాళ్ల సాయంతో కిందకు జారవిడిచారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారగా, అగ్రవర్ణ దురహంకారంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos