దళిత బ్రాహ్మణుడు

దళిత బ్రాహ్మణుడు

అగ్రశ్రేణి మరాఠీ సాహితీవేత్త, బహుభాషాకోవిదుడు డా.శరణకుమార లింబాళె. 29 యూనివర్సిటీల్లో ఆయన రచనలపై అధ్యయనాలు చేస్తున్నారు. ఆయన 36 రచనలు ఇతరభాషల్లోకి అనువాదమయ్యాయి. ఆయన 15 కథలను ‘దళిత బ్రాహ్మణుడు’ టైటిల్‌తో తెలుగులోకి అనువదించారు ప్రముఖ అనువాదకుడు రంగనాథ రామచంద్రరావు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ, బ్రాహ్మణవాడలో నివసించే ఒక దళితుడికి ఎదురైన అనుభవాలే టైటిల్ కథ ‘బ్రాహ్మణ దళితుడు’. ఇందులోని కథలన్నీ దళితులకు జరుగుతున్న అన్యాయాలను కళ్ళకు కడతాయి.

దళిత బ్రాహ్మణుడు కథలుమరాఠీ మూలం. డా.శరణకుమార్‌ లింబాళె. అనువాదం రంగనాథ రామచంద్రరావు. ధర 100 రూపాయలు. పేజీలు 130. ప్రతులకు నవచేతన పబ్లిషింగ్‌ హౌస్‌, బుక్‌హౌస్‌లు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos