ధర్మశాల: బుద్ధుని కాలంతో పోల్చితే ప్రపంచం నేడు ఎంతో మారినా ఆయన బోధనలు నేటికీ ఆచరణీయాలని బౌధ్ధ ఆధ్యాత్మిక గురవు దలైలామా అన్నారు. ‘బుద్ధుని బోధనలు ఏ ఒక్క వర్గానికో, దేశానికో మాత్రమే కాదు. వివేకము గల అందరికీ ఆచరణీయం. ప్రజలు వారి సామర్థ్యం, అభిలాషకు అనుగుణంగా ఆయన మార్గాన్ని అనుసరించవచ్చు. నేను బాల్యం నుంచే బుద్ధ విద్య ప్రారంభించాను. నాకిప్పుడు 86 ఏళ్లు. అయినా ఇంకా నేర్చుకుంటూనే ఉన్నా. అందుకే నాకు అవకాశం ఉన్నప్పుడల్లా బౌద్ధులను ప్రోత్సహిస్తుంటా. బోధనల వాస్తవ ఆంతర్యం ఏంటి, వాటిని ఎలా పాటించాలని తెలుసుకోవడం కోసం 21వ శాతాబ్దపు బౌద్ధులను కలుస్తుంటాను. వినడం, చదవడం, ఏం విన్నాం? ఏం చదివాం? అని ఆలోచించడం ద్వారా వాటికి మీరు మరింత చేరువవుతార’ని దలైలామా సందేశాన్ని ఇచ్చారు.