ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలో తారక్ జోడీగా లండన్‌కు చెందిన నటి డైసీ ఎడ్గర్ జోన్స్ తీసుకుంటున్నట్లు దర్శకుడు రాజమౌళి అధికారికంగా ప్రకటించగానే డైసీ పేరు ఇండియా మొత్తం మారుమోగింది.ఏ వెబ్‌సైట్‌లో చూసినా,ప్రసార,సామాజిక మాధ్యమాల్లో చూసినా డైసీ గురించే ప్రముఖంగా వార్తలు వినిపించాయి.డైసీ గురించి తెలుసుకోవడానికి తెలుగు ప్రేక్షకులతో పాటు అన్ని భాషల ప్రేక్షకులు, సినీజనాలు కూడా డైసీ కోసం అంతర్జాలంలో వెతుకులాడారు.మరోవైపు డైసీ ట్విట్టర్ ఖాతాపై తారక్, చరణ్ అభిమానులు పోటెత్తారు.డైసీ ఫోటోలకు లైకులు కొట్టడం నుంచి డైసీ ఖాతాను ఫాలో కావడం, ప్రాజెక్ట్‌లో అవకాశం దక్కించుకున్నందుకు శుభాకాంక్షలు తెలపడం మొదలుపెట్టారు.ఇలా కేవలం ఒక్కరోజులో వేలకొద్దీ లైకులు,సందేశాలు,ఫాలోయర్స్ పెరిగే సరికి డైసీ సంభ్రామాశ్చర్యానికి లోనయ్యారు.రోజురోజుకు సందేశాలు, లైకుల ఉధృతి తీవ్రతరం కావడంతో ట్విట్టర్ ఖాతాను తాత్కాలింగా డీయాక్టివేట్ చేసింది.అదీమరి తెలుగు ప్రేక్షకులా మజాకా!!