తన తోడల్లుడు (చంద్రబాబు) వింత జాతికి చెందిన వ్యక్తి అని, పూటకో మాట మాట్లాడే స్వభావం ఆయనదంటూ దగ్గుబాటి వెంకటేశ్వరరావు విమర్శించారు. ఒంగోలులలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, పర్చూరు నియోజకవర్గం నుంచి తన కుమారుడు హితేష్ పోటీ చేస్తాడని తెలిపారు. రాజధాని నిర్మాణం పేరుతో ఇప్పటి వరకు గ్రాఫిక్స్ చూపించారని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా హితేష్ మాట్లాడుతూ, ఎన్టీఆర్ ఏ ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చారో అదే ఆశయాన్ని తన తల్లిదండ్రులు కూడా కొనసాగించారన్నారు. ఎన్టీఆర్ స్పూర్తితో రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నానని తెలిపారు.