కట కటాల్లో కరోనా బాబా

కట కటాల్లో కరోనా బాబా

హైదరాబాద్: ఇక్కడి మియాపూర్లో కరోనా బారి నుంచి కాపాడు తామని వ్యాధిగ్రస్తుల్ని వంచించిన ఇస్మాయిల్ బాబా అనే మోసగాణ్ని పోలీసులు శనివారం అరెస్టు చేసారు . నిందితుడు భక్తుల సమ స్యల్ని తీర్చుతానంటూ తాయత్తులు కట్టి డబ్బు సంపాదించుకునే వాడు. కరోనా భయం ఎక్కువయిపోవడంతో కొత్త వంచన ఆరంభించాడు. కరోనా మందు ఇస్తానంటూ రూ.12 వేల చొప్పున భక్తుల నుంచి వసూలు చేశాడు. అయితే ఎంతకీ మందు ఇవ్వకపోవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు ఇస్మాయిల్ బాబాను హఫీజ్పేట్ హనీఫ్ కాలనీలో అదుపులోకి తీసుకున్నారు. అతడిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటా మని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos