విశాఖ : బంగాళాఖాతం లో ఏర్పడిన అల్పపీడన ద్రోణి తీవ్ర వాయుగుండంగా మారుతున్నందున ఆంధ్ర ప్రదేశ్ ఉత్తర తీర ప్రాంతం, ఒడిశా దక్షిణ ప్రాంతాల్లో తుపాను సంభవించనుంది. శని , ఆదివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సోమవారానికి తీవ్ర వాయు గుండం వాయు గుండంగా బలహీనపడుతుందని పేర్కొంది. తెలంగాణ, ఛత్తీస్ గఢ్ లలోనూ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఆ గాలుల వేగం రేపటికి 75 కి.మీ కు పెరిగే అవకాశం ఉంది. మత్స్యకారు లెవరూ చేపల వేటకు వెళ్లొద్దని, వెళ్లిన వారు వెంటనే తిరిగొచ్చేయాలని సూచించింది.