కార్మికుల హక్కులను కాలరాస్తున్న యోగి

కార్మికుల హక్కులను కాలరాస్తున్న యోగి

లక్నో : వలసదార్ల సమితి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా కార్మికుల లభించిన హక్కులను కాలరాయాలని చూస్తోందని కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విమర్శించారు. ‘ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో కార్మికులకు సహాయం చేయాల్సింది పోయి. తమ ప్రభుత్వ అనుమతి లేకుండా ఎవరూ పనుల నిమిత్తమై వలస కార్మికులను తీసుకెళ్లకూడదన్న నిబంధన విధించడం ఏంట’ని మండిపడ్డారు. కార్మికులను ప్రభుత్వం కట్టేయాలని చూస్తోందా? వారి హక్కులను కాలరాయాలని చూస్తోందా? అని ట్విట్టర్ లో తీవ్రంగా ధ్వజమెత్తారు. వలస కార్మికలు సమస్యలను సానుభూతి కోణంలో పరిష్కరించాల్సింది పోయి… సమస్యను జటిలం చేస్తున్నారని . ఈ విషయంలో తాము రాజకీయాలు చేయమని, ప్రభుత్వానికి ఈ విషయంలో సహాయకారిగా ఉంటామని హామీ ఇచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos