హోసూరు ప్రాంతంలో పశువులకు మేతగా మారిన విలువైన పంటలు

హోసూరు ప్రాంతంలో పశువులకు మేతగా మారిన విలువైన పంటలు

హోసూరు ప్రాంతంలో రైతులు లక్షలు ఖర్చు చేసి పండించిన వాణిజ్య పంటలు కొనేవారు కరువై చివరకు పశువులకు మేతగా మారింది.లాక్ డౌన్ కారణంగా హోసూరు ప్రాంతంలో రైతులు అప్పులపాలైయ్యారు.కృష్ణగిరి జిల్లాలోని హోసూరు,బాగలూరు,తళి,సూలగిరి,డెన్కనికోట తదితర ప్రాంతాలలో వానిజపు పంటలైన క్యాబేజీ,బంగాళాదుంపలు,క్యారెట్,బీట్రూట్, బీన్స్ తదితర వాణిజ్య పంటలను ఎక్కువగా పండిస్తూ తమిళనాడులోని వివిధ జిల్లాలకే కాక కర్ణాటక,కేరళ,మరియు ఉభయ తెలుగు రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారు.గత 50 రోజులుగా కరోనా ప్రభావంతో లాక్ డౌన్ అమలు కావడంతో హోసూరు కూరగాయల మార్కెట్టే కాక అన్ని ప్రాంతాలలో మార్కెట్లు మూతపడి రవాణా పూర్తిగా నిలిచిపోయింది.మార్కెట్లు మూతపడడంతో కూరగాయలను కొనే వ్యాపారులు కరువై రైతులు పండించిన పంటలు అమ్ముకునే దిక్కులేక లక్షలు ఖర్చు చేసి పండించిన పబతలను తోటల్లోనే వదలివేయడంతో ప్రస్తుతం పశువులకు మేతగా మారింది.అప్పులు చేసి పండించిన పంటలు వృధా కావడంతో హోసూరు ప్రాంత రైతులు అప్పుల వూబిలో చిక్కుకొని కష్టాలు పడుతున్నారు. ప్రభుత్వం ముందుకు వచ్చి రైతులు పండించిన కూరగాయలను కొనుగోలు చేసియుంటే కొంత మేలు కలిగేదని ఇక్కడి రైతులు వాపోతున్నారు.లాక్ డౌన్ కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వారు డిమాంబద్ చేస్తున్నారు. సహకార సంఘ బ్యాంకుల ద్వారా ఋణాలు పొంది వ్యవసాయం చేసామని చేతికొచ్చిన పంటలు అమ్ముడుపోక బ్యాంకు ఋణాలు తీర్చే పరిస్థితి కనిపించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.లాక్ డౌన్ కారణంగా హోసూరు ప్రాంతంలో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరారు.

పశువులకు మేతగా మారిన టమోటా పంట

తాజా సమాచారం

Latest Posts

Featured Videos