నాలుగేండ్లలో 701 రాజద్రోహం కేసులు, 5023 ఉపా కేసులు

నాలుగేండ్లలో 701 రాజద్రోహం కేసులు, 5023 ఉపా కేసులు

న్యూఢిల్లీ : 2018-2022 మధ్య కాలంలో దాదాపు 701 రాజద్రోహం కేసులు, నేరాలు నమోదయ్యాయని కేంద్ర మంత్రి నిత్యానంద రారు  లోక్సభలో తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం-ఉపా కింద 5,023 కేసులు నమోదయ్యాయని చెప్పారు. అయితే, 2021లో 149గా వున్న రాజద్రోహం కేసులు, 2022లో 68కి తగ్గాయని తెలిపారు. అదే ఉపా కేసులకు వచ్చేసరికి 2021లో 814 నమోదు కాగా, 2022లో 1005కి పెరిగాయని మంత్రి రాతపూర్వక సమాధానంలో తెలిపారు. ఇదే కాలంలో, రాజద్రోహం కేసుల్లో 788మందిని అరెస్టు చేసి, 500మందిపై చార్జిషీట్ దాఖలు చేశామని చెప్పారు. 131మందిని నిర్దోషులగా విడుదల చేసినట్లు కూడా తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos