చంద్రబాబు అభినవ దుర్యోధనుడు

కడప : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురై అభినవ దుర్యోధనుడిలా వ్యవహరిస్తున్నారని వై కాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.రామచంద్రయ్య వ్యాఖ్యా నించారు. సోమవారం ఇక్కడ ఆయన మాధ్యమ ప్రతినిధులతో మాట్లాడారు. కుట్రలు, కుతంత్రాలతో జగన్ను రాజకీయంగా దెబ్బకొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. బ్యాంకుల బకాయిల్ని ఎగ్గొట్టిన వారిని ప్రముఖ ప్రచార కర్తలు నియమించి జగన్ను తిట్టిస్తున్నారని దుయ్యబట్టారు. జగన్కి నానాటికీ పెరుగుతున్న ఆదరణ వల్ల చంద్రబాబు నిరాశ, నిస్పృహలకు గురవుతున్నారన్నారు. రాష్ట్ర రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రాశేఖర రావును ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలతో ముడి పెట్టి రెండు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని దుయ్యబట్టారు. కెసిఆర్ ను రెచ్చగొ ట్టేందుకు గల కారణం ఏమిటని ప్రశ్నించారు. గతంలో హరికృష్ణ మృత దేహం వద్ద పొత్తు కోసం కెటిఆర్ తో మాట్లాడిన చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో చేసిన అభివృద్ధి ఏమిటి అని ప్రశ్నించారు. అమరావతి చుట్టూ చంద్రబాబు అస్మదీయులు భూములు కొని భారీగా లబ్ధి పొందారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ తెదేపా స్క్రిప్ట్ ను చాలా నిబద్ధతతో అనుసరించి జనం దృష్టిలో నవ్వుల పాలవుతున్నారని ఎద్దేవా చేసారు.‘ ప్రజలు నవ్వుకుంటారని కాని, అభిమానులు బాధపడతారనే బాధే పవన్ కళ్యాణ్కు లేద’ని నిప్పులు చెరిగారు. మాట నిలకడ లేని పవన్ కళ్యాణ్ వంటి నాయకులు, వ్యక్తులు సమాజానికి చాలా ప్రమాదకరమని హెచ్చరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos