ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం

ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం

నరసాపురం : ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని, రాష్ట్రాల హక్కులు దెబ్బతింటాయని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. గురువారం నరసాపురం పట్టణంలో సీపీఎం రాష్ట్ర సభలకు హాజరైన రాఘవులు, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ఎం.ఏ.బేబీ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావుతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ …. జమిలి ఎన్నికల వల్ల ప్రాంతీయ పార్టీలు నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉందన్నారు. దేశంలో ప్రాంతీయ పార్టీలు రాష్ట్ర ప్రయోజనాలను పక్కనపెట్టి ఢిల్లీలో మోడీ భజన చేస్తున్నాయన్నారు. అంబేద్కర్‌ పై అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్‌ చేశారు. అమిత్‌ షా వ్యాఖ్యలను నిరసిస్తూ ఈనెల 30న వామపక్షాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని తెలిపారు. ఎన్నికల కమిషన్‌ బిజెపికి తొత్తుగా మారిందని విమర్శించారు. ఎన్నికల ప్రక్రియను బిజెపి దుర్వినియోగం చేస్తుందని ధ్వజమెత్తారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos