ఉచిత ఇసుక హామీ అమలు చేయాలని సిపిఎం నిరసనలు

ఉచిత ఇసుక హామీ అమలు చేయాలని  సిపిఎం నిరసనలు

కొండపల్లి : రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక హామీని అమలు చేసి, నిర్మాణదారులకు వెసులుబాటు కల్పించి భవన నిర్మాణ కార్మికులకు పని కల్పించాలని కోరుతూ సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సిపిఎం ఆధ్వర్యంలో నేడు నిరసనలు చేపట్టారు. శుక్రవారం ఎన్‌టిఆర్‌ జిల్లా కొండపల్లి స్టేషన్‌ సెంటర్‌ వద్ద సిపిఎం కొండపల్లి టౌన్‌ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం ఎన్టీఆర్‌ జిల్లా కార్యదర్శి డివి కృష్ణ మాట్లాడుతూ … ఎన్టీఆర్‌ జిల్లాలో నిర్మాణ రంగంలో 36 రకాల వృత్తుల్లో సుమారు లక్షల 50 వేల మంది పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారని అన్నారు. ఇసుక లేక కొరత వల్ల పనులు లేక కార్మికుల అల్లాడుతున్నారని చెప్పారు. భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు పున్ణ ప్రారంభించాలని, సంక్షేమ బోర్డు ద్వారా వచ్చే సంక్షేమ పథకాలు 13, 14 తక్షణమే రద్దు చేసి పెండింగ్‌ క్లయిములు విడుదల చేయాలని కోరారు. ఓ పక్క ఉపాధి లేక కార్మికులు అర్ధాకలతో అలమటిస్తూ ఉన్నారని అన్నారు. 100 రోజులు కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఇది మంచి ప్రభుత్వం పేరుతో ప్రచారం చేసుకుంటున్నారు తప్ప ఎన్నికల హామీలు భాగంగా ఇసుక ఉచితంగా హామీని అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో ఉన్న ఇసుక క్వారీలన్నిటిని తెరిచి అందరికీ ఇసుక లభించే విధంగా తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కొండపల్లి సిపిఎం టౌన్‌ కార్యదర్శి ఎం మహేష్‌ , టౌన్‌ కమిటీ సభ్యులు ఈ కొండలరావు బేబీ సరోజిని, కొండపల్లి బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ సిఐటియు నాయకులు కృష్ణా రాయలు, ప్రసాద్‌, రమేష్‌, జానీ, నాగమల్లేశ్వరరావు, ఇమ్మానియేల్‌ , పాపయ్య, తదితరులు పాల్గొన్నారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos