ఒంగోలు : అధికార కేంద్రీకరణకు దారితీసే జమిలి ఎన్నికలు దేశానికి నష్ట దాయకమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి .శ్రీనివాస రావు పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జమిలి ఎన్నికలపై టిడిపి, వైసీపీ తమ వైఖరి వెల్లడించాలని కోరారు. 100 రోజుల పాలనా మాటలకూ, ఆచరణకు పొంతన లేదని తెలిపారు. తిరుపతి లడ్డు విషయంలో చంద్రబాబు వ్యాఖ్యలు సరి కాదని పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను సెయిల్ కు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఒక దేశం ఒకే ఎన్నికకు అనుకూలంగా కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని సిపిఎం తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది ప్రజా స్వామ్యం పైన, ఫెడర లిజం పైన, దేశ ప్రజల సార్వభౌమత్వం పైన తల పెట్టిన దాడి అని విమర్శించారు. రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసేందుకు జరుగుతున్న ఈ యత్నాన్ని తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపు నిచ్చారు.