ఇక్కడ బీజేపీ ఆటలు సాగవు

ఇక్కడ బీజేపీ ఆటలు సాగవు

అనంతపురం : ప్రజల మధ్య చీలికలు పెట్టి రాజకీయంగా బలపడాలని భాజపా చూస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విమర్శించారు. సోమవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘భాజపా ప్ర జల మధ్య చీలికలు పెట్టి రాజకీయంగా బలపడాలని చూస్తోంది. ఇది తెలంగాణ కాదు. ఆంధ్ర రాష్ట్రం. ఇక్కడ బీజేపీ ఆటలు సాగవు. ప్రధాని మోదీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఐదేళ్ల తర్వాత వచ్చిన మోదీ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెర వేర్చాలి. ప్రత్యేక హోదా, విభజన హామీలతోపాటు ఏ ఒక్క హామీ ఇప్పటికీ పరిష్కారం కాలేదు. ప్రత్యేక హోదా ప్రకటించని పక్షంలో మోదీ రాష్ట్రంలోకి అడుగు పెట్టే పరిస్థితి ఉండదు. అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో ప్రత్యేక హోదా కోసం పోరాటం కొనసాగిస్తాం. మోదీ ఏపీకి వచ్చిన సందర్భంగా వైసీపీ, టీడీపీలు ప్రత్యేక హోదాపై తమ వైఖరి వెల్లడించాలి. లేని పక్షంలో బీజేపీలానే వైసీపీ టీడీపీలు కూడా రాష్ట్రానికి ద్రోహం చేసినట్లు అవుతుంది. ప్రత్యేక హోదా కోసం పార్టీలకతీతంగా పోరాడుతామ’ని స్పష్టం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos