ఎమ్మెల్యే ఏ రాజా ఎన్నిక‌పై సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్న‌ల్‌

ఎమ్మెల్యే ఏ రాజా ఎన్నిక‌పై సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్న‌ల్‌

న్యూఢిల్లీ: కేర‌ళలో సీపీఎం పార్టీ అభ్య‌ర్థి ఏ రాజా.. ఎమ్మెల్యేగా ఎన్నికైన అంశంపై ఇవాళ సుప్రీంకోర్టు )లో వాద‌న‌లు జ‌రిగాయి. దేవ‌కులం నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2021 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆయ‌న ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు. అయితే ఆ నియోజ‌క‌వ‌ర్గం ఎస్సీ రిజ‌ర్వ్ స్థానం కావ‌డం వ‌ల్ల .. రాజా ఎన్నిక‌ను ప్ర‌శ్నిస్తూ ప్ర‌త్య‌ర్థి కాంగ్రెస్ అభ్య‌ర్థి కేసు దాఖ‌లు చేశారు. గ‌తంలో కేర‌ళ హైకోర్టు తీర్పునిస్తూ ఎమ్మెల్యే రాజా ఎన్నిక‌ను ర‌ద్దు చేసింది. అయితే ఇవాళ ఆ తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. జ‌స్టిస్ అభ‌య్ ఎస్ ఓకా, అస‌నుద్దిన్ అమానుల్లా, ఆగ‌స్టిన్ జార్జ్ మాషిల‌తో కూడిన సుప్రీం ధ‌ర్మాసం ఈ కేసులో తీర్పును ఇచ్చింది.ఎమ్మెల్యే రాజా క్రిస్టియ‌న్ అని, ఆయ‌న ఎలా ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తార‌ని కేర‌ళ హైకోర్టు లో కేసు దాఖ‌లైంది. ఈ కేసులో కేర‌ళ కోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ఇవాళ డిస్మిస్ చేసింది. హైకోర్టు ఆదేశాల‌ను ప‌క్క‌న పెట్టేస్తున్న‌ట్లు సుప్రీం ధ‌ర్మాస‌నం తెలిపింది. శాస‌న‌స‌భ పోస్టుకు పిటీష‌న‌ర్ అర్హుడ‌ని ఇవాళ సుప్రీంకోర్టు పేర్కొన్న‌ది. కేర‌ళ‌లోని దేవికులం ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే రాజా ఎన్నిక‌ను సుప్రీంకోర్టు స‌మ‌ర్ధించింది. ఆ కేసులో కేర‌ళ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. హైకోర్టు తీర్పుకు వ్య‌తిరేకంగా రాజా దాఖ‌లు చేసిన అప్పీల్‌ను సుప్రీం ధ‌ర్మాస‌నం స్వీక‌రించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos