విజయవాడ : అన్ని రంగాల్లోనూ రాష్ట్రంపై వివక్ష చూపుతున్న కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి ప్రజానీకం సమైక్యంగా ముందకు రావాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సమావేశం పిలుపు నిచ్చింది. ఇవీ డిమాండ్లు….ఆర్ధిక , కరోనా కష్టాలతో తల్లడిల్లుతున్న రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు కొంతవరకు ఊరటనిస్తున్నాయి. వీటిపై కోత విధించే ప్రయత్నం జరుగుతోంది. కొందరు అభివృద్ధి పేరుతో సంక్షేమ కార్యక్రమాలను వ్యతిరేకిస్తున్నారు. అభివృద్దికి, సంక్షేమానికి పోటీ పెట్టడం సరైంది కాదు. సంక్షేమ పథకాలకు అవసరమైన నిధులను కేంద్రంపై పోరాడి తెచ్చుకోవడానికి బదులు ప్రజలపై అదనపు భారాన్ని మోపడాన్ని వ్యతిరేకించింది. ఆస్తి పన్ను పెంపును తక్షణం ఉపసంహ రిం చు కోవాలని, పెట్రోలు, డీజిల్పై పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కేరళల తరహాలో తమ కొస్తున్న సుంకంలో కొంత తగ్గించాలి. గిరిజన యువతకు ఉద్యోగవకాశాలు కల్పించే జీవో 3ని పునరుద్దరించాలి. 1/70ని అమలు చేయాలి. భూఅసైన్డు చట్ట సవరణను ఉపసంహరించుకోవాలి. ఉపాధి హామీ బకాయిల్ని వెంటనే చెల్లించాలి. పోలవరం నిర్వాసి తులకు పరిహారం చెల్లించాలి. ప్రాథమిక విద్యను బలహీనపరుస్తున్న నూతన విద్యా విధానాన్ని వెనక్కి తీసుకోవాలి. పేదలకు స్థలాలిచ్చినా ఇండ్లు కట్టుకోడానికి పూర్తి స్తాయిలో సహాయం చేయాలి. టిడ్కో ఇళ్లను వెంటనే లబ్దిదారులకు స్వాధీనం చేయాలి. ఉద్యోగులకు సిపిఎస్ రద్దు, పిఆర్సిపై చేసిన వాగ్దానం అమలు చేయాలి. మహి ళలకు రక్షణ కల్పించాలి. అత్యాచారబాధిత కుటుంబాలను ఆదుకోవాలి. కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులిచ్చి రక్షణ కల్పించాలి. నిబంధనల పేరుతో సంక్షేమ పథకాలపై కోత విధించరాడు. ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం మోపుతున్న భారాలను ప్రతిఘటించాలి