సనాతన ధర్మాన్ని సమర్థించే పవన్ కళ్యాణ్‌ను అరెస్ట్ చేయాలి

సనాతన ధర్మాన్ని సమర్థించే పవన్ కళ్యాణ్‌ను అరెస్ట్ చేయాలి

తిరుపతి:జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని సమర్థించే పవన్ కళ్యాణ్‌ను అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నారాయణ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ మాట్లాడిన‌ స‌నాత‌న ధ‌ర్మంపై నేను ప్ర‌శ్నిస్తే న‌న్ను విమ‌ర్శిస్తున్నారు. అస‌లు స‌నాత‌న ధ‌ర్మంలో విడాకులు ఉంటాయా.. ప‌వ‌న్ అభిమానులను నేను అడిగే ప్ర‌శ్న అదే. అస‌లు స‌నాత‌నంలో విడాకుల‌నే మాటనే ఉండదు. ఒక్క‌సారి పెళ్లి చేసుకున్న త‌ర్వాత స‌నాత‌న ధ‌ర్మంలో భర్త ఎంత వేధించిన ఎంత హింసించిన అత‌డితోనే కాపురం చేయాల‌ని స‌నాత‌నం చెబుతుంది. మ‌రి సనాతన ధర్మంలో విడాకులే లేనప్పుడు, పవన్ కళ్యాణ్ ఎలా విడాకులు తీసుకుని మూడు పెళ్లిల్లు చెసుకున్నాడు. పవన్ కళ్యాణ్ పాటించే సనాతన ధర్మం చాలా క్రూరమైనది, అరాచకమైనది. ఎవరు దాన్ని సమర్థించినా వాళ్ళను అరెస్ట్ చేయాలి అని నారాయ‌ణ వెల్ల‌డించారు. సనాతన ధర్మాన్ని విమర్శించే వారిపై పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాల‌ని చెబుతున్నాడు. అస‌లు స‌నాత‌న ధ‌ర్మాన్ని సమర్థించే వారిని శిక్షించాలి అని నేను చెబుతున్నా.. అంటూ నారాయ‌ణ చెప్పుకోచ్చాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos