వామ పక్షాలతో పొత్తు కాంగ్రెస్ కు క్షేమదాయకం

వామ పక్షాలతో పొత్తు కాంగ్రెస్ కు క్షేమదాయకం

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. సీపీఐతో పొత్తు వలనే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. బతికుండగానే ఏపీ సీఎం జగన్ సమాధి కట్టుకున్నారని హాట్ కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూడా అధికార మార్పిడి ఖాయమని నారాయణ స్పష్టం చేశారు. ధరణి పేరుతో కేసీఆర్ చేసిన మోసం కంటే జగన్ ఎక్కువ తప్పులు చేస్తున్నారన్నారు. తెలంగాణ, ఏపీలో ఒక్కో లోక్సభ స్థానంలో సీపీఐ పోటీ చేస్తుందన్నారు. కమ్యూనిస్టులతో పొత్తు లేకపోవడం వల్లే మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయిం దన్నారు. కాంగ్రెస్ జాతీయ నాయకత్వం దీన్ని గుణపాఠంగా తీసుకోవాలని తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos