రూపాయి విరాళానికి కన్నయ్య వినతి

పాట్నా:బిహార్, బెగుసరాయ్‌ లోక్‌సభ నియోజకవర్గం భారత కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థిగా తొలి సారిగా ఎన్నికల రణ రంగంలోకి దిగిన విద్యార్థి నాయకుడు రూపాయి విరాళానికి కన్నయ్య వినతి వినతికి సమాజం నుంచి చక్కటి స్పందన లభించింది. ‘ఇతర పార్టీల అభ్యర్థులంతా ఎన్నికల ప్రచారానికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. మనకు ప్రచారం చేసుకోవడానికి డబ్బులు లేవు. అందుకే ఒక్కొక్కరు కనీసం ఒక్క రూపాయి అయినా విరాళం ఇవ్వాల’ చేసిన మనవికి తొలి రోజే వదాన్యులు రూ.38లక్షల విరాళాన్ని అందించి తమ సంఘీభావాన్ని చాటారు. ‘బొట్టుబొట్టుతో కుండ నిండినట్టు మీరిచ్చే ఒక్కొక్క రూపాయే నాకు ప్రచారానికి ఉపయోగపడుతుంది’ అని ఓటర్లను వేడుకున్నాడు. తాను గెలిస్తే అణగారిన, దోపిడీకి గురవుతున్న వర్గాల వాణిని పార్లమెంటులో వినిపిస్తానని హామీ ఇస్తున్నాడు. నిధుల కోసం అంతర్జాల వేదికలో క్రౌడ్‌ ఫండింగ్ కూడా ప్రారంభించాడు. బెగుసరాయ్‌ నియోజకవర్గంలో ఆయన బీజేపీ నేత, కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌తో తలపడుతున్నాడు. ‘ప్రధాని పదవి నుంచి మోదీని తప్పించాలని బిహార్‌ ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారు. కాబట్టి ఈ ఎన్నికల్లో తాను గెలవడం ఖాయ’మని భరోసా వ్యక్తీకరించారు. దేశ ద్రోహం నేరం కింద 1996లో అరెస్టయిన కన్నయ్య డిల్లీ జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos