కోవ్యాక్సిన్ కు అనుమతిచ్చేందుకు తొందర ఎందుకు?

కోవ్యాక్సిన్ కు అనుమతిచ్చేందుకు తొందర ఎందుకు?

న్యూ ఢిల్లీ: భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ మూడవ దశ ట్రయల్స్ రిపోర్ట్ వెల్లడి కాకుండానే, అత్యవసర అనుమతులు ఇవ్వడం పట్ల బీబీసీ తన ప్రత్యేక కథనంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించింది. ‘ఏదైనా వ్యాక్సిన్ ను తయారు చేస్తే, దీర్ఘకాలం పాటు ట్రయల్స్ నిర్వహించాలి. మూడు దశల్లో పరీక్షలు చేయాలి. ఎవరికీ, ఏ విధమైన దుష్పరిణామాలు ఉండబోవని తేలిన తరువాతే అనుమతులివ్వాల’ని  బీబీసీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఇండియాలో వ్యాక్సిన్ అనుభవజ్ఞుడిగా విశేషమైన పేరు తెచ్చుకున్న డాక్టర్ గగన్ దీప్ కాంగ్ వెల్లడించారు. కంపెనీ నుంచి తమ వ్యాక్సిన్ సురక్షితమని రిపోర్టు వచ్చినంత మాత్రాన పూర్తి పరిశీలన లేకుండానే ఎలా అనుమతి ఇచ్చారని కాంగ్ ప్రశ్నించారు. కొవాగ్జిన్ ట్రయల్స్ లో 24 వేల మందికి పైగా జరిగిందని, అయితే, వారికి సంబంధించిన పూర్తి రిపోర్టును మాత్రం ఇండియా నియంత్రణ సంస్థలు పరిగణనలోకి తీసుకోలేదని  సంస్థ వెల్లడించింది.‘మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ రిపోర్ట్ లేకుండా ఎలా అనుమతి ఇచ్చారో తెలియడం లేదు. రెండు ట్రయల్స్ లోనే ఏ వ్యాక్సిన్ పనితీరుపై తుది అంచనాకురారాదు. దీని పనితీరుపై పూర్తి అవగాహన ఉండాలి. ప్రజలకు ఇవ్వాలో వద్దో అన్నీ పరిశీలించాకే నిర్ణయించాలి” అని వైరాలజిస్ట్ డాక్టర్ షాహిద్ జమీల్ జమీల్ వ్యాఖ్యానించారని పేర్కొంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos