న్యాయస్థానంలో చంద్రబాబుకు చుక్కెదురు

అమరావతి: ఉన్నత పోలీసు అధికార్ల బదిలీ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ఉన్నత న్యాయ స్థానంలో చుక్కెదురైంది. ఎన్నికల సంఘం ఆదేశాల్లో తాము జోక్యం చేసుకోలేమని శుక్రవారం తేల్చి చెప్పింది. నిఘా విభాధిపతి ఏబీ. వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం, కడప ఎస్పీల బదిలీలపై గురువారం సుదీర్ఘ వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం ధర్మాసనం తన తీర్పును శుక్రవారానికి వాయిదా వేసింది. ‘నో కేస్ ఫర్ ఇంటిరిమ్ రిలీఫ్’అని న్యాయమూర్తి ప్రవీణ్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది. దరిమిలా ఎన్నికల సంఘం ఆదేశాలు తు.చ తప్పకుండా అమలు కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన వ్యాజ్యంపై భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) తరఫున గురువారం సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్ రెడ్డి, ఎన్నికల విధులతో సంబంధం లేని నిఘా విభాగాధి పతిని బదిలీ చేసే అధికారం ఎన్నికల సంఘానికి లేదని ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos