ఏపిలో కౌంట్‌డౌన్ స్టార్ట్, వ‌చ్చే నెలలోనే ఎన్నిక‌ల నోటిఫికేష‌న్

ఏపిలో కౌంట్‌డౌన్ స్టార్ట్, వ‌చ్చే నెలలోనే ఎన్నిక‌ల నోటిఫికేష‌న్

ఏపిలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు కౌంట్ డౌన్ మొద‌లైంది. ఏపి అసెంబ్లీ..లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు వ‌చ్చే నెల‌లో నోటిఫికేష‌న్ విడుద‌ల‌కు రంగం సిద్దం చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ మేర‌కు ఎన్నిక‌ల సంఘం క్షేత్ర స్థాయి ప‌ర్య‌ట‌న‌ల‌కు సిద్దం అ వుతంది. తెలంగాణ‌లో ఒక విడ‌త‌..ఏపిలో రెండు విడ‌త‌ల్లో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ కు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, ఏపి లో గెలుపు మాదంటే మాద‌ని చెబుతున్న పార్టీలు..ఎన్నిక‌ల‌కు సిద్దంగా ఉన్నాయా..కౌంట్ డౌన్ మొద‌లైంది.. ఏపి లో సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఎన్నిక‌ల సంఘం కౌంట్ డౌన్ మొద‌లు పెట్టింది. ఈ ఏడాది మే నెల చివరి వారంలోగా లోక్‌సభ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించింది.ఆంధ్రప్రదేశ్‌లో రెండు దశల్లో పోలింగ్‌ నిర్వహించే అంశంపై ఆలోచిస్తోంది. ఎన్నికల సన్నద్ధతను పరిశీలించేందుకు వచ్చే వారం నుంచి కేంద్ర ఎన్నికల సంఘం బృందాల వారీగా అన్ని రాష్ట్రాల్లో పర్యటించనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి చివరి వారం లేదంటే మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అంశంపై తుది నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనలో ఈసీ ఉంది. వివిధ రాష్ట్రాల బోర్డు పరీక్షల తేదీలపైనా ఆరా తీసింది. తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నిక‌ల పూర్తి అయింది. లోక్‌స‌భ ఎన్నిక‌ల కు మాత్ర‌మే స‌మాయ‌త్తం కావాల్సి ఉంది. ఏపిలో మాత్రం లోక్‌స‌భ తో పాటుగా అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించాల్సి ఉంది. దీంతో.. ఏపిలో ఏర్పాట్ల పై ఇసి దృష్టి సారించింది.
ఏపి లో ఒకే ద‌శా.. రెండు ద‌శ‌లా…
2014 ఎన్నికల ప్రక్రియలో భాగంగా మార్చి నెల అయిదో తేదీన ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. 14వ తేదీన ప్రక టన జారీ చేసింది. తొమ్మిది దశల్లో పోలింగ్‌ నిర్వహించింది. ఏప్రిల్‌ ఏడో తేదీన తొలిదశ పోలింగ్‌ జరగ్గా.. మే 12న చివ రిదైన తొమ్మిదో విడత పోలింగ్‌ జరిగింది. మే 16న ఓట్ల లెక్కింపు చేపట్టి 28వ తేదీనాటికి ఎన్నికల ప్రక్రియ అంతటినీ పూర్తి చేసింది. ఈదఫా కూడా మే నెల 24వ తేదీ నాటికి పూర్తి చేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంద‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలో ఏపిలోని 175 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాలు.. 25 లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల్లో రెండు విడ‌త‌లుగా నిర్వ‌హించే అవ‌కాశం క‌నిపిస్తోంది. అయితే, ఎన్నిక‌ల సంఘం ప్ర‌తినిధులు మాత్రం ఏపిలో ఒకే విడ‌త‌లో పూర్తి చేసే అవ‌కాశాలు కొట్టి పారేయ‌లేమ‌ని చెబుతున్నారు. దీంతో..వ‌చ్చే నెల‌లో దీని పై స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది.
ఏపిలో పార్టీలు సిద్ద‌మేనా..!
ఏపిలో వ‌చ్చే నెల‌లోల‌నే ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ పార్టీలు భావిస్తున్నాయి. అం దు లో భాగంగానే త‌మ ఎన్నిక‌ల వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నాయి. అధికార పార్టీ ఇప్ప‌టికే ఎన్నిక‌ల తాయిలాల‌ను ప్ర‌క‌టించ‌టం తో పాటుగా మ‌రిన్ని కీల‌క నిర్ణ‌యాల దిశ‌గా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే.. ఏపి ప్ర‌భుత్వం ఈ నెల 21న కీల‌క క్యాబినెట్ స‌మావేశం ఏర్పాటు చేసింది. ఆ స‌మావేశంలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకోనున్నారు. ఇక‌, ఈ నెల 30 నుండి ఓన్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ స‌మావేశాల‌కు ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఆ స‌మావేశాల్లో రాజ‌కీయం గా కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటార‌ని స‌మాచారం. ఇక‌, విప‌క్ష పార్టీ వైసిపి ఇప్ప‌టికే దాదాపు అభ్య‌ర్ధుల ఖ‌రారు ప్ర‌క్రియ పూర్తి చేసింది. 175 స్థానాల్లో 120 స్థానాల వ‌ర‌కు అభ్య‌ర్ధుల ఎంపిక పూర్త‌యిన‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే పాద‌యాత్ర ను పూర్తి చేససుకున్న వైసిపి అధినేత జ‌గ‌న్ ఎన్నిక‌ల స‌మ‌ర‌శంఖం పూరించారు. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ సైతం ఎన్నిక ల కోసం కార్యాచ‌ర‌ణ సిద్దం చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos