డెహరాడూన్:ఉత్తరాఖండ్‌ను మరోసారి భారీ వరదలు చుట్టుముట్టాయి. చమోలీ జిల్లాలో థరలీలో భారీ వర్షం కారణంగా వరదలు సంభవించాయి. దీంతో అనేక నివాసాలను వరద నీరు ముంచెత్తింది. వాహనాలు బురదలో కూరుకుపోయాయి. విద్యాసంస్థలను మూసివేశారు. వరదలు కారణంగా పలువురు గల్లంతైనట్లు తెలుస్తోంది. వెంటనే సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వరద ప్రభావిత ప్రాంతాలకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. వరదల్లో చిక్కుకుపోయిన స్థానికులను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. సగ్వారా గ్రామంలో శిథిలాల కింద ఓ యువతి చిక్కుకుపోయింది. భారీ వర్షాల కారణంగా చెప్డోలో ఒక వృద్ధుడు తప్పిపోయినట్లు సమాచారం.