ముంబై : అమెరికా మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ ఇండియన్ మోటార్ సైకిల్స్ రెండు కొత్త మోడళ్లను భారత్ మార్కెట్‌లో ప్రవేశపెట్టనుంది. ఎఫ్‌టీఆర్‌ఎస్ 1200 ఎస్ మోడల్ బైక్‌ను పరిచయం చేయనుంది. రెండు వేరియెంట్లలో ఇవి లభ్యం కానున్నాయి. ఎఫ్‌టీఆర్ 1200 ఎస్ ధరను రూ.14.99 లక్షలు, ఎఫ్‌టీఆర్ 1200 ఎస్ రేస్ రెప్లికా ధరను రూ.15.49 లక్షలుగా నిర్ణయించారు. అయితే ప్రస్తుతం ఆటోమొబైల్ రంగం ఇక్కడ ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ధరలేమైనా తగ్గించవచ్చా అనే ఎదురు చూపులున్నాయి. వీటిలో అత్యాధునిక హంగులను సమకూర్చారు. పలు ఆధునిక ఎలక్ట్రానిక్ ఉపకరణాలను పొందుపరిచారు.