తిరుపతి: కరోనా రోగుల నిర్వాకంతో అధికారులకు ముచ్చెమటలు పట్టాయి. గత రెండు నెలల్లో ఇక్కడ 9,164 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 7,270 మంది ఆచూకీ మాత్రమే లభించింది. మిగిలిన 1,049 మంది రోగులు ఎక్కడున్నారనే విషయం తెలియడం లేదు. వారి ఫోన్ నంబర్లు కూడా పని చేయడం లేదు. వీరి కోసం గాలిస్తున్నారు. మరో 845 మంది రోగులు తిరుపతిని వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయినట్లు అధికారులు గుర్తించారు. కరోనా పరీక్షలకు తప్పుడు చిరునామాలు, ఫోన్ నంబర్లు ఇస్తున్నారు. పరీక్షల ఫలితాలు రాకముందే వారు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నట్టు అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. వీరి వల్ల కరోనా ఇతరులక సోకుతోందని చెప్పారు.