కరోనా ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుంచి మనుషుల జీవితాల్లో వింతలు విశేషాలు ఎక్కువయ్యాయి. కరోనా పేరు చెప్పి ఏదో ఒక సంచలన విషయాలు వెల్లడించడం మామూలైంది. జనాలు కూడా ఏది నిజం..ఏది అపద్దం అనేది పట్టించుకోకుండా అన్ని నమ్మేస్తున్నారు. కొందరైతే కరోనా పేరు చెప్పి వ్యాపారాలు చేసుకోవడం కూడా మొదలు పెట్టారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్లో ఓ టిఫిన్ హోటల్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఎందుకంటే దాని పేరు ‘యాంటీవైరస్ టిఫిన్ సెంటర్’ కావడమే. పైగా ఆ హోటల్ కు లివప్ ద ట్రెండ్ అనే ఓ క్యాప్షన్ కూడా ఉంది. ఈ హోటల్ని కొత్తగా నిర్మించగా.. దానిని జనాల్లోకి తీసుకెళ్లేందుకు హోటల్ నిర్వాహకులు ఈ వెరైటీ పేరును ఎంచుకున్నారు. వారు చేసిన పని వారికి విజయాన్ని అందించింది. కరోనా కాలం కాబట్టి ఆ ప్రాంతంలో హోటల్ కి ఈ పేరు పెట్టగానే అది ఫేమస్ అయ్యింది. హోటల్ కి ‘యాంటీవైరస్ టిఫిన్ సెంటర్’ అని సోషల్ మీడియాలో దానిపైన కుళ్ళు జోకులు వేస్తున్నారు. ఎలాగైతేనేమి ఆ హోటల్ పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.