ఆ జన్యువే భారతీయులను రక్షిస్తోందా!

ఆ జన్యువే భారతీయులను రక్షిస్తోందా!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణమృదంగం సృష్టిస్తూ విలయతాండవం చేస్తుంటే భారత్‌లో మాత్రం కరోనా ప్రభావం అంతంతమాత్రంగానే ఉండడంతో ప్రపంచమంతా భారత్‌వైపు ఆశ్చర్యంగా చూస్తోంది.భారతదేశ జనాభాలో సగం కూడా అమెరికా,ఫ్రాన్స్‌ వంటి అగ్రదేశాల్లో సైతం లక్షల్లో కేసులు వేలల్లో మరణాలు సంభవిస్తుంటే 130 కోట్లకు పైగా జనాభా ఉన్న భారత్‌లో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా పరిస్థితులు ఉండడంతో ఆ రహస్యం ఏంటో తెలియక ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోతోంది. ఆ మాటకు వస్తే.. యూరప్ లోని పలు దేశాల్లోనూ ఇలాంటి దారుణమైన పరిస్థితే నెలకొంది. మొత్తంగా చూసినప్పుడు ప్రపంచ వ్యాప్తంగా 15 లక్షల మంది కరోనా బారిన పడితే.. 90వేల మంది ఇప్పటి వరకూ మరణించారు. ఇక.. భారత్ విషయానికి వస్తే ఇప్పటి వరకూ 5865 మందికి కరోనా పాజిటివ్ గా తేలితే..దాని  కారణంగా మరణించిన వారు 199 మందిగా తేల్చారు. ఆరోగ్య రంగంలో మనకున్న శక్తిసామర్థ్యాలు చాలా పరిమితమైనవి. అలాంటివేళ.. కరోనా పిశాచి బారిన పడకుండా ఎలా సేవ్ అయ్యామన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. దీనికి మొదటి కారణంగా.. కరోనా తొలిదశలోనే కేంద్రం కళ్లు తెరిచి లాక్ డౌన్ విధించటం ఒకటైతే.. భారతీయుల్లో ఉన్న ప్రత్యేక జన్యువు కూడా కరోనాను తట్టుకొనేందుకు కారణమైందన్న విశ్లేషణ ఆసక్తికరంగా మారింది. రోజుకు సరాసరి 500 పాజిటివ్ కేసులు నమోదవుతున్నా.. మరిన్ని కీలక చర్యలు తీసుకుంటే.. సంఖ్యను తగ్గించే వీలుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. భారతీయుల జన్యుపటాన్ని చూసినప్పుడు hsamiR27B అనే జన్యువే కరోనా బారిన భారీగా పడకుండా చేస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. జన్యువే భారతీయుల శరీరాల్ని కరోనా ఛిద్రం చేయకుండా కాపాడుతుందన్న మాట బలంగా వినిపిస్తోంది. అయితే.. దీన్ని శాస్త్రీయంగా నిరూపించాల్సిన అవసరం ఉంది. మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే.. మలేరియా ప్రబలిన దేశాలు.. ప్రాంతాల్లోనూ కరోనా వేగంగా వ్యాప్తి చెందటం లేదన్న విషయాన్ని మధ్యనే గుర్తించారు. మలేరియా వచ్చినప్పుడు వాడే క్లోరోక్విన్ వాడటం కూడా కరోనాను కంట్రోల్ చేసే శక్తి వచ్చినట్లుగా చెబుతున్నారు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos