న్యూఢిల్లీ : కరోనా భారత్లో మరో రికార్డు సృష్టించింది. గత 24 గంటల్లో నమోదైన కేసులతో సహా భారత్లో ఇప్పటివరకు రెండు కోట్ల మందికి పైగానే కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకూ లో అమెరికాలో 3.24 కోట్లు కేసులు నమోదు కాగా రెండు కోట్లు మార్క్ దాటిన దేశం భారత్. గత 24 గంటల్లో దేశ వ్యా ప్తంగా3,57,229 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళ వారం వెల్లడించింది. సోమవారం ఒక్కరోజే 3,449 మంది మరణించారు. ప్రస్తుతం రోగుల సంఖ్య 34 లక్షలకు చేరింది. ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతోంది.