ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారమూ ఎప్పటి లాగే భారీ నష్టాల్ని మూట గట్టుకున్నాయి.మదుపర్లు వాటాల అమ్మకానికే మొగ్గు చూపటం ఇందుకు కారణం. సెన్సెక్స్ 1,203 పాయింట్లు నష్టపోయి 28,265కి, నిఫ్టీ 344 పాయింట్లు కోల్పోయి 8,254కి పతనమయ్యాయి.దిగజారింది. బీఎస్ఈ సెన్సెక్స్ లో హీరో మోటో కార్ప్ (2.21%), బజాజ్ ఆటో (1.12%), బజాజ్ ఫైనాన్స్ (0.40%), టైటాన్ కంపెనీ (0.35%) లాభాల్నిపొందాయి. టెక్ మహీంద్రా (-9.21%), కొటక్ మహీంద్రా బ్యాంక్ (-8.81%), టీసీఎస్ (-6.23%), ఇన్ఫోసిస్ (-5.65%), యాక్సిస్ బ్యాంక్ (-5.50%) దండిగా నస్ట పోయాయి.