కర్ణాటక బీజేపీ ట్విట్టర్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు..

కర్ణాటక బీజేపీ ట్విట్టర్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు..

కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు,ఉద్యమాలు హోరెత్తుతున్న తరుణంలో కర్ణాటక బీజేపీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ అయిన వీడియో, కామెంట్ ఇప్పుడు వివాదాస్పదం అయ్యాయి. ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా, పోలింగ్ కేంద్రం వద్ద క్యూ కట్టిన మైనారిటీ మహిళలు, తమ చేతిలోని గుర్తింపు కార్డులను చూపుతూ ఉండగా, తీసిన వీడియోను పోస్ట్ చేసిన బీజేపీ, కర్ణాటక విభాగం, “గుర్తింపు కార్డులు జాగ్రత్తగా ఉంచుకోండి. మళ్లీ ఎన్పీఆర్సర్వేలో చూపించాల్సి ఉంటుందిఅని కామెంట్ చేయడం ఇప్పుడు విమర్శలను కొనితెచ్చింది. బీజేపీ వైఖరిపై పలువురు నిప్పులు చెరుగుతున్నారు. కర్ణాటక బీజేపీ ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ ఢిల్లీలో ఎన్నికలు జరిగిన 8 తేదీన పోస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos