టికెట్ ఇస్తామంటూ ఇచ్చిన హామీలను పార్టీ పెద్దలు తప్పడంతో ఆగ్రహంతో ఓ కాంగ్రెస్ నేత ప్రచార సామాగ్రిని తగులబెట్టిన ఘటన తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది.హైదరాబాద్ నగరంలోని కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేత క్రిశాంక్ గత ఏడాది డిశెంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో టికెట్ ఇస్తామంటూ పార్టీ పెద్దలు హామీ ఇవ్వడంతో ప్రజాప్రతినిధిగా ఎదుదామని ఎన్నో కలలు కన్నాడు.అయితే శాసనసభ ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం సాధ్యం కావడం లేదని లోక్‌సభ ఎన్నికల్లో తప్పకుండా టికెట్ ఇస్తామంటూ పార్టీ పెద్దలు హామీ ఇవ్వడంతో సర్దిచెప్పుకున్న క్రిశాంక్ లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో టికెట్‌పై ఆశలు పెంచుకొని టికెట్ తనకే దక్కుతుందన్న ధీమాతో ప్రచార సామాగ్రి కూడా సిద్ధం చేసుకున్నాడు.అయితే లోక్‌సభ ఎన్నికల్లో కూడా పార్టీ పెద్దలు మరోసారి మాట తప్పడంతో ఆగ్రహంతో రగిలిపోయిన క్రిశాంక్ టీపీసీసీ అధికార ప్రతినిధి పదవితో పాటు ప్రధాన కార్యదర్శి పదవికి కూడా రాజీనామా చేశాడు.అయినా పార్టీ నేతలు ఎవరూ పట్టించుకోకపోవడంతో మరింత ఆగ్రహంతో రలిగిపోయిన క్రిశాంక్ పార్టీ పెద్దలపై,కాంగ్రెస్ హైకమాండ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రూ.15లక్షల విలువ చేసే ప్రచార సామాగ్రికి నిప్పు పెట్టాడు.కాంగ్రెస్ పార్టీలో ఉంటే టికెట్లకు బదులు అవమానాలు మిగులుతాయని టికెట్ ఇస్తామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి,కాంగ్రెస్ అధిష్టానం తనను దారుణంగా మోసం చేసారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు..
