తళి కానిస్టేబుల్ సస్పెన్షన్

తళి కానిస్టేబుల్ సస్పెన్షన్

హోసూరు : కుటుంబ కలహాల వల్ల భర్త పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళతో అక్రమ సంబంధం ఏర్పరుచుకున్న కానిస్టేబుల్ వ్యవహారం బయటకు పొక్కడంతో అతనిని సస్పెండ్ చేసిన సంఘటన హోసూరు సమీపంలోని తళి పోలీస్ స్టేషన్ లో జరిగింది. తళి సమీపంలోని దేవగానపల్లికి చెందిన మంజునాథ్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఇతని భార్య అనిత గార్మెంట్స్ కంపెనీ లో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తుంది. మంజూనాథ్ తరచూ మద్యం సేవించి భార్యను వేధించేవాడు. భర్త వేధింపులు భరించలేక అనిత తళి లోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అనిత ఫిర్యాదు మేరకు తళి పోలీస్ స్టేషన్ లోని శ్యామ్ గురు అనే కానిస్టేబుల్ కు కేసును విచారించాలని అప్పచెప్పారు. అందులో భాగంగా కానిస్టేబుల్ శ్యామ్ గురు కేసు విచారణ సాకుతో అనితతో వివాహేతర సంబంధం ఏర్పరచుకుని వారింటికి వెళ్లి వచ్చేవాడు. దీనిపై మంజునాథ్ శ్యామ్ గురును నిలదీశాడు. ఈ సందర్భంగా పోలీసులు మంజునాథకు సర్దిచెప్పి అక్కడి నుండి పంపించేశారు. తన భార్య అనిత తో కానిస్టేబుల్ శ్యామ్ గురు వివాహేతర సంబంధం కొనసాగించడం వల్ల తన కాపురం కూలిపోయిందని విరక్తి చెందిన మంజునాథ్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. స్థానికులు పోలీసుల సాయంతో మంజునాథ్ను రక్షించి చికిత్సకో సం హోసూరు ఆస్పత్రికి తరలించారు. కానిస్టేబుల్ శ్యామ్ గురు నిర్వాకం బయటకు పొక్కడంతో కృష్ణగిరి జిల్లా ఎస్పీ బండి గంగాధర్ విచారణ చేపట్టారు. ఎస్పీ విచారణలో కానిస్టేబుల్ వివాహేతర సంబంధం తెలియడంతో శ్యామ్ గురును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos