కేసీఆర్‌కు జైలు శిక్ష తప్పదు..

కేసీఆర్‌కు జైలు శిక్ష తప్పదు..

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యమని కేంద్రంలో యూపీఏ అధికారం దక్కించుకోనుందని యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ను జైలుకు పంపిస్తామంటూ మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు.కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం కొలువుదీరగానే సీఎం కేసీఆర్ అవినీతిని,కేసీఆర్ కుటుంబ పాలనను బయటకు లాగుతామంటూ హెచ్చరించారు.ఈ ఐదేళ్లలో కేసీఆర్ కుటుంబం మొత్తం రాష్ట్రాన్ని దోచుకుతిన్నారని రాష్ట్ర ఖజానా ఖాళీ కావడంతో తమ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ఆరు నెలలవుతున్నా ఇప్పటి వరకు మంత్రివర్గాన్ని భర్తీ చేయడం లేదంటూ ఆరోపించారు.తెలంగాణలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఫలితాలే లోక్సభ ఎన్నికల్లో కూడా పునరావృతం కానున్నాయని మరో ఆరు నెల్లో తెరాస పార్టీ నశించిపోవడం ఖాయమన్నారు.యూపీఏ అధికారంలోకి రాగానే అవినీతిపై విచారణ జరిపించి సీఎం కేసీఆర్ను జైలుకు పంపిచి తీరుతామంటూ హెచ్చరించారు.ఇంటర్ విద్యార్థులు ఉసురు తగిలి సీఎం కేసీఆర్ సర్వనాశనమవుతాడంటూ కొద్ది రోజుల క్రితం కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించగా కేసీఆర్ పాలన అంతం కావాలని పెద్దమ్మ తల్లిని మొక్కుకున్నానంటూ కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.తెలంగాణలో కాంగ్రెస్కు ఊపిరాడనివ్వకుండా కేసీఆర్ వ్యూహాలు రచిస్తుండడంతో కొద్దిరోజులుగా కాంగ్రెస్ నేతలు కేసీఆర్పై ఈవిధంగా అసహనం వెల్లగక్కుతున్నారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos