దేశ రాజకీయాల్లో కేసీఆర్‌ చక్రం తిప్పడం తథ్యం..

దేశ రాజకీయాల్లో కేసీఆర్‌ చక్రం తిప్పడం తథ్యం..

కాంగ్రెస్‌ పార్టీ మునిగిపోయే నావని అటువంటి కాంగ్రెస్‌ పార్టీ వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఒరిగేది ఏమి లేదంటూ తెలంగాణ రాష్ట్ర పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు విమర్శించారు.లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మహబూబాబాద్‌ లోక్‌సభ అభ్యర్థి మాలోతు కవిత తరపున ప్రచారాల్లో పాల్గొన్నారు.16 ఎంపీ సీట్లతో దేశరాజకీయాల్లో ఏం మార్పులు తీసుకువస్తారంటూ తెరాసపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్‌ నేతలు కేవలం రెండు ఎంపీ సీట్లతోనే తెలంగాణ రాష్ట్రం తీసుకువచ్చిన ఘరత కేసీఆర్‌దేనని గుర్తుంచుకోవాలన్నారు.దేశరాజకీయాల్లో కేసీఆర్‌ చక్రం తిప్పడం ఖాయమని లోక్‌సభ ఎన్నికల్లో 16 లోక్‌సభ స్థానాల్లోనూ తెరాస అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కేసీఆర్‌ వంద మంది ఎంపీల మద్దతు కూడగట్టారని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో మునిగిపోయే పడవని కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేల వల్ల రాష్ట్రానికి కలిగే ప్రయోజనం శూన్యమన్నారు.గిరిజనులు పోడు చేసుకుంటున్న భూములకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వడంతో పాటు రైతుబంధు పథకాన్ని కూడా వర్తింపచేస్తామంటూ ఎర్రబెల్లి హామీ ఇచ్చారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos