గులాం నబీ ఆజాద్‌పై మండిపాటు

గులాం నబీ ఆజాద్‌పై మండిపాటు

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ రాజీనామా చేసినందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఘాటుగా స్పందించింది. రాజీనామా చేసేందుకు ఇదా సమ యం అని ఆ పార్టీ ప్రతినిధి ప్రధాన కార్యదర్శి, జాతీయ ప్రతినిధి జైరాం రమేష్ శుక్రవారం ఇక్కడ జరిగిన విలేఖరుల సమావేశంలో నిలదీశారు. ‘ఇది చాలా దురదృష్టకరం. ధరల పెరుగుదల, నిరుద్యోగం సహా పలు అంశాలపై బీజేపీతో కాంగ్రెస్ పోరాటం సాగిస్తున్న తరుణంలో ఆజాద్ రాజీనామా చేయడం విచారకరం. గులాం నబీ ఆజాద్ తన లేఖలో పేర్కొన్న అంశాలు అవాస్తవం. ద్రవ్యోల్బణం, పోలరైజైషన్కు వ్యతిరేకంగా పార్టీ పోరాటం సాగిస్తున్న తరుణంలో రాజీనామా చేయడం సందర్భోచితం కాద’ని వ్యాఖ్యా నించారు. గులాం నబీ ఆజాద్ రాజీనామాపై ఆ పార్టీ సీనియర్ నేత, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తీవ్రంగా స్పందించారు. ‘కాంగ్రెస్ పార్టీ ఆయనకు (ఆజాద్) అన్నీ ఇచ్చింది. ఆయన ఈరోజు పేరున్న నాయకుడు అయ్యాడంటే ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీ సోనియాగాంధీ కారణం. పార్టీలో ఆయన ఎన్నో పదవులు కూడా చేపట్టారు. అలాం టి ఆజాద్ రాజీనామా లేఖ రాసారంటే ఏమీ మాట్లాడలేకుండా ఉన్నాం. రాజీనామా లేఖ రాస్తారని ఎవరూ ఊహించలేదు. గతంలో ఆయన సోనియాగాంధీ వైద్యపరీక్షల కోసం అమెరికా వెళ్లినప్పుడు కూడా లేఖ రాశార’న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos