రాహుల్ గాంధీపై నైట్‌క్లబ్‌ దుమారం

రాహుల్ గాంధీపై నైట్‌క్లబ్‌ దుమారం

న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ నైట్‌క్లబ్‌ వీడియో వివాదంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. వివాహ వేడుకకు రాహుల్ వెళ్లడం నేరమా? అని ఆ పార్టీనేత రణదీప్ సుర్జేవాలా ప్రశ్నించారు. పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పుట్టినరోజుకు పిలవకుండా ప్రధాని మోదీ వెళ్లినట్టు.. రాహుల్ గాంధీ వెళ్ళలేదుగా అని ఎద్దేవా చేశారు. ఆహ్వానిస్తేనే రాహుల్ వివాహ వేడుకకు వెళ్లారని వివరించారు. ఫ్రెండ్ పెళ్లికి హాజరయ్యేందుకు ఆయన ఖాట్మండ్ వెళ్లారని చెప్పారు. రాహుల్ వ్యక్తిగత టూర్‌లో ఉన్నారు. ఇందులో తప్పేముందో చెప్పాలని బీజేపీ నేతలకు సవాలు చేశారు. విద్యుత్ సంక్షోభం, ద్రవ్యోల్బణం వంటి సమస్యలపై బీజేపీ వాళ్లు ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. కానీ వారి సమయమంతా రాహుల్ కోసమే కేటాయిస్తారని సుర్జేవాలా మండిపడ్డారు.
పెళ్ళిళ్లకు హాజరవ్వడం భారత్‌లో నేరం కాదు
కుటుంబాన్ని కలిగివుండడం, పెళ్లిళ్లు, వివాహ నిశ్చితార్థ వేడుకలకు హాజరవ్వడం భారత్‌లో సాంప్రదాయకం, నాగరికత అని సుర్జేవాల్ అన్నారు. పెళ్లిళ్లు చేసుకోవడం, స్నేహం చేయడం, పెళ్లి వేడుకలకు హాజరవడం ఈ దేశంలో ఇంకా నేరంగా మారలేదనే విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. గాంధీ కుటుబానికి చెందిన వ్యక్తి సాధారణ వ్యక్తిలా ఓ పెళ్లి రిసెప్షన్‌కు హాజరైతే తప్పేంటో చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ మండిపడ్డారు. ఏం తప్పు జరిగిందో దర్యాప్తు చేసుకోవచ్చన్నారు. కారణం లేకుండా కాంగ్రెస్ నాయకుడిని విమర్శించడానికి బదులు ముఖ్యమైన సమస్యలపై దృష్టిసారించాలని హితబోధ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos