ఫారూఖ్… ఏమిటా మాటలు…కాంగ్రెస్‌ మండిపాటు

ఫారూఖ్… ఏమిటా మాటలు…కాంగ్రెస్‌ మండిపాటు

న్యూఢిల్లీ: చైనా సహకారంతో జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370ని పునరుద్దరించుకుంటామని నేషనల్‌ కాన్ఫరెన్స్ అధినేత ఫారూఖ్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. ఆయనవి పూర్తిగా బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలని కొట్టి పారేసింది. అంతే కాకుండా ఫారూఖ్ వ్యాఖ్యలు నిందనీయమైనవని కూడా పేర్కొంది. దేశంలో అనేక భావజాలాలు, వాటి మధ్య వైరుధ్యాలు, వివక్షలు ఉన్నప్పటకీ.. దేశ సరిహద్దుల్లోకి ఇతర దేశాలు చొరబడాలని చూస్తే అంతా ఏకమవుతామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి వ్యాఖ్యానించారు. ‘‘మన దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి. వాటికి వేరు వేరు సిద్ధాంతాలు, భావజాలాలు ఉన్నాయి. వాటి మధ్య తేడాలు, వివక్షలు కూడా ఉన్నాయి. అయితే దేశ సరిహద్దుల్లోకి చైనా చెడు ఉద్దేశాలతో అడుగు పెట్టాలని చూస్తే అందరం ఒకే తాటి పైకి వస్తాం. ఫారూఖ్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు చైనాకు అనుకూలంగా ఉన్నాయి. ఇవి పూర్తిగా బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలే కాకుండా ఖండించదగినవి కూడా’’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos