ఎంపీ వసంతకుమార్‌కు ఘన నివాళి

ఎంపీ వసంతకుమార్‌కు ఘన నివాళి

హోసూరు : సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, కన్యాకుమారి లోక్‌సభ స్థానం సభ్యుడు వసంతకుమార్‌కు హోసూరులో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన నివాళులర్పించారు. వసంతకుమార్‌కు కరోనా వైరస్ సోకడంతో నెల రోజుల క్రితం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. గత నెల రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందిన వసంతకుమార్ కరోనా నుంచి బయటపడినా, న్యుమోనియా వల్ల శుక్రవారం సాయంత్రం కన్నుమూశారు. ఆయన మృతికి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు సంతాపం తెలిపారు. హోసూరులో కాంగ్రెస్ పార్టీ నాయకులు గాంధీ విగ్రహం వద్ద వసంతకుమార్ చిత్ర పటాన్ని ఉంచి, పూల మాలలు వేసి నివాళులర్పించారు. హోసూరు మాజీ ఎమ్మెల్యే, ఐఎన్టీయూసీ నాయకుడు కె.ఎ. మనోహరన్ వసంతకుమార్ చిత్ర పటానికి పూలమాలలు శ్రద్ధాంజలి ఘటించారు. కాంగ్రెస్ నాయకులు మురళి, త్యాగరాజు, ముత్తప్ప, కీర్తి గణేష్ తదితరులు వసంతకుమార్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos