తిరువనంతపురం: చట్ట వ్యతిరేకంగా అరెస్టు, పోలీసు నిర్బంధంలో వేధింపులకు గురైన ఇస్రో మాజీ శాస్త్రవేత్త ఎస్.నంబి నారాయణన్కు రూ.1.3 కోట్లు నష్ట పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. 1990 కేరళలో నంబి నారాయణన్ గూఢచర్యానికి పాల్పడ్డారనే ఆరోపణల్ని ఎదుర్కొన్నారు. విచారణలో ఆయన నిర్దోషిగా తేలారు. దరిమిలా తనకు నష్టపరిహారం చెల్లించాలని తిరువనంతపురం న్యాయస్థానంలో వ్యాజ్యాన్ని దాఖలు చేసారు. ఇందుకు న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. ప్రభుత్వ తీర్మానాన్ని సామాజిక మాధ్యమాల్లో స్వాగతించారు. ప్రభుత్వాన్ని అభినందనతో ముంచె త్తారు. ఎట్టకేలకు న్యాయమే గెలిచిందని హర్షాతిరేకాలు వ్యక్తం చేసారు.