ఇస్లామాబాద్: పాక్ ఐక్య రాజ్య సమితికి భారత్ కు వ్యతిరేకంగా రాసిన లేఖలో కేవలం కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీతో బాటు భాజపానూ కూడా వివాదంలోకి లాగింది. హర్యానా భాజపా ప్రభుత్వ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, ఉత్తరప్రదేశ్ భాజపా శాసనసభ్యుడు విక్రమ్ శైనీలు కశ్మీరీ మహిళల పట్ల వారు చేసిన వ్యాఖ్యలను ఆ లేఖలో పేర్కొంది. లింగత్వాన్ని కూడా అస్త్రంగా భాజపా నేతలు వాడుకుంటున్నారని పాకిస్థాన్ దుయ్య బట్టింది. జమ్ము – కశ్మీర్ లో మారిన పరిణామాల వల్ల తెల్లగా ఉండే కశ్మీరీ యువతులను ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చని సైనీ చేసిన వ్యాఖ్య లను పాక్ ఉటం కించింది. కశ్మీర్ అందరికీ అందుబాటులో వచ్చినందున పెళ్లి కూతుళ్లను అక్కడి నుంచి తెచ్చుకుంటామని కొందరు చెబుతున్నారని మనోహర్ ఖట్టర్ ప్రకటించారని పాక్ మండిపడింది.