ఒకప్పుడు దేశంలో ఒక వెలుగు వెలుగిన కమ్యూనిస్ట్ పార్టీలు ఇప్పుడు కనుమరగయ్యే స్థితికి వచ్చాయి. పేదలకోసం పోరాటాలు చేసిన కమ్యూనిస్టులు ఇప్పుడు తమ భవిష్యత్ కోసం పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా ఇక ఎలాగోలా తమ ఉనికిని చాటుకోడానికి ప్రయత్నిస్తున్న సీపీఐ సీపీఎం పార్టీలకి ఊహించని షాక్ తగిలింది. ఈ రెండు పార్టీలకి జాతీయహోదాని రద్దు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికలసంఘం 2013 లో జారీచేసిన నోటిఫికేషన్ ఆధారంగా సీపీఎం– సీపీఐ పార్టీలకు జాతీయహోదా రద్దు చేసింది. జాతీయ పార్టీ హోదాకు కావాల్సిన ఓట్లు సీట్లు కూడా సాధించకపోవడంతో కేంద్ర ఎన్నికల సంఘం సీపీఐ– సీపీఎం పార్టీలకు జాతీయ హోదా రద్దు చేసింది.