ఎక్స్‌ప్రెస్
టీవీ అధినేత చిగురుపాటి జయరామ్ హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది.జయరామ్ హత్య కేసుకు
సంబంధించి ప్రధాన నిందితుడు రాకేశ్‌రెడ్డిని అరెస్ చేసిన తెలంగాణ పోలీసులు జయరామ్
హత్య కేసుతో సంబంధం ఉందనే అనుమానంతో జయరామ్ మేనకోడలు శిఖా చౌదరిని కూడా పలుమార్లు
విచారించారు.ఈ క్రమంలో జయరామ్ హత్య కేసులో సంబంధం ఉన్నట్లు కమెడియన్ సూర్య ప్రసాద్‌పై
కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జయరామ్ మృతదేహాన్ని సూర్యప్రసాద్‌తో
పాటు అతడి అసిస్టెంట్ కిశోర్,అంజిరెడ్డి కూడా చూశారని అయినా పోలీసులకు సమాచారం అందింకపోవడంతో
పోలీసుల్లో అనుమానాలు బలపడ్డాయి.దీంతో జయరామ్ హత్య కేసులో మరిన్ని వివరాలు రాబట్టేందుకు
సూర్యను విచారించగా విచారణలో ఎటువంటి సమాధానాలు చెప్పకపోవడంతో లాభం లేదనుకున్న పోలీసులు
సూర్య ప్రసాద్‌ను అరెస్ట్ చేశారు.విచారణ వేగవంతం చేయడానికే పోలీసులు సూర్య ప్రసాద్‌ను
అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.త్వరలోనే సూర్యను మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం
ఉంది..