జమ్మూ: జమ్మూకశ్మీర్ లోని దోడా జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఇవాళ ఫైరింగ్ జరిగింది. కేవలం 4 గంటల వ్యవధిలోనే రెండుసార్లు కాల్పుల ఘటన చోటుచేసుకున్నది. కొందరు అనుమానాస్పదంగా సంచరిస్తున్న నేపథ్యంలో.. విలేజ్ డిఫెన్స్ గార్డులు కూడా ఫైరింగ్కు పాల్పడ్డారు. గాండో ఏరియా నుంచి రెండు పేలుడు పదార్ధాలను రికవర్ చేశారు. మంగళవారం రాత్రి 10.45 నిమిషాలకు తొలుత కలాన్ భాటా ప్రాంతంలో ఫైరింగ్ జరిగింది. ఆ తర్వాత తెల్లవారుజామున రెండు గంటలకు పంచాన్ భాటాలో మరోసారి కాల్పులు చోటు చేసుకు న్నాయి. దేసా ఫారెస్ట్ ఏరియాలో ప్రస్తుతం ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ కొనసాగుతోంది. సోమవారం ఈ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో నలుగు భారత జవాన్లు వీరమరణం పొందారు.