కృష్ణగిరి జిల్లా కలెక్టర్ సుడిగాలి పర్యటన

కృష్ణగిరి జిల్లా కలెక్టర్ సుడిగాలి పర్యటన

హోసూరు : కృష్ణగిరి జిల్లా కలెక్టర్ ప్రభాకరన్‌ సోమవారం జిల్లాలోని పలు ప్రాంతాలలో పర్యటించి అభివృద్ధి పనుల పర్యవేక్షించడంతో పాటు కరోనా నివారణ చర్యలపై అధికారుల వద్ద వివరాలను అడిగి తెలుసుకున్నారు. సోమవారం కృష్ణగిరి యూనియన్‌లోని కల్లుగురికి పంచాయతీలో రూ.11.45 లక్షల ఖర్చుతో చెరువుల్లో పూడిక తొలగింపు పనులను కలెక్టర్ పరిశీలించారు. తరువాత బరుగూరులో కరోనా బాధితులకు అందుతున్న చికిత్సల గురించి ఆయన ఆరోగ్య శాఖ అధికారులను ఆడిగి తెలుసుకొన్నారు. అనంతరం కృష్ణగిరి సమీపంలోని మేల్పట్టి గ్రామంలో  చౌక ధరల దుకాణాన్నికలెక్టర్ ప్రభాకరన్ తనిఖీ చేసి వినియోగదారులకు అందుతున్న నిత్యావసర సరుకుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ పర్యటనలో ఆయనతో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు ఉన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos